HomeTelanganaNizamabadరాష్ట్ర కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఇర్ఫాన్‌ అలీ నియామకం..

రాష్ట్ర కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఇర్ఫాన్‌ అలీ నియామకం..

రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ నియమితులయ్యారు. జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను రాష్ట్ర స్థాయి పదవికి పదోన్నతి కల్పిస్తూ ఏఐసీసీ (AICC) మైనార్టీ విభాగం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నియమించినందుకు జాతీయ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇమ్రాన్ ప్రతాప్ కి కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా ఇందుకు సంహరించిన రాష్ట్ర కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని,కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగాన్ని రాష్ట్ర స్థాయిలో క్షేత్రం నుండి బలోపేతం చేస్తూ పర్టీ అభివృద్ధికి తోడ్పతనని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మరియు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఇర్ఫాన్ అలీకి శుభాకాంక్షలు తెలిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సుచించారు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, అబుద్ బిన్ హందాన్,ప్రీతం,ముస్తఫా,అష్రఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments