Thursday, April 16, 2026
HomeTelanganaNizamabadఅధ్యక్షా ……!పార్టీ ప్రక్షాళన ఉందా? లేదా……రగులుతున్న క్యాడర్ …..జోడు పదవుల్లో డీసీసీ ,అర్బన్ అధ్యక్షులు ……..దశాబ్దాల...

అధ్యక్షా ……!పార్టీ ప్రక్షాళన ఉందా? లేదా……రగులుతున్న క్యాడర్ …..జోడు పదవుల్లో డీసీసీ ,అర్బన్ అధ్యక్షులు ……..దశాబ్దాల కాలంగా నిస్తేజం పార్టీవ్యవస్థ ……

పీసీసీ అధ్యక్షుడి గా యేడాది కాలం పూర్తీ చేసి ఆ సస్సెస్ సంబరాలు చేసుకున్న మహేష్ గౌడ్ ఫై సొంత జిల్లాలో పార్టీ గాలికి వదిలేసారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అసలు ఇప్పట్లో పార్టీ ప్రక్షాళన ఉంటుందా లేదా ? పార్టీలో తనదైన ముద్ర మహేష్ వేసుకుంటారా లేదా ? అనే అసహనంతో క్యాడర్ రగిలి పోతుంది. డీసీసీ తో పాటు అర్బన్ అధ్యక్షులు దాదాపు యేడాదిన్నర కాలంగా జోడు పదవుల్లో కొనసాగుతున్నారు.

జిల్లా లో పార్టీ వ్యవస్తంగా నిస్తేజంగా మారింది వరుసగా రెండు పర్యాయాలు లోకల్ బాడీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది. ఈసారి పార్టీ అధికారంలో ఉంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడం అనివార్యం.

అసలే అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లోకల్ బాడి ఎన్నికల్లో గెలవడం అంత సులువేమి కాదు అందులోనూ పీసీసీ చీఫ్ సొంత జిల్లా కదా ! ఫలితాల ఏ మాత్రం తేడా వచ్చినా రాజకీయంగా ప్రతికూలత తలెత్తే ప్రమాదం వుంటుందని అయన విధేయులు ఆందోళన చెందుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్రతిసారి జెడ్పి స్థానం గెలుస్తూ వస్తుంది. కానీ ఈసారి జెడ్పి పీఠం దక్కడం అంత సులువేమి కాదు. పోయిన ఎన్నికల్లో ఒకరిద్దరు జెడ్పిటిసి లు గెలిచారు.ఒక్క ఎంపీపీ కూడా నిలబెట్టుకోలేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్ ల్లో పోటీచేస్తే రెండే స్థానాలకు పరిమితం అయింది. మొత్తంగా జిల్లాలో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉందనేది బహిరంగ రహస్యం.

మొన్నటి నామినేటెడ్ పదవుల పంపకాలు ఓ దందా లా సాగించారు. కనీసం పార్టీ పదవులైన సమర్థులైనవారికి ఇస్తారనే ఆశాభావం తో ఉన్నారు. మహేష్ గౌడ్ సొంత జిల్లాలోనే పార్టీలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆయన పీసీసీ చీఫ్ గా నియమాకం అయ్యాక మొదట జిల్లా నుంచే పార్టీ ప్రక్షాళన పక్రియ మొదలు పెడతారని భావించారు.

డీసీసీ అధ్యక్షుడు నియామకం ఫై ఆయనకు పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి.డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కి కీలకమైన కార్పొరేషన్ ఛైర్మెన్ పదవి దక్కింది. దీనితో అయన స్థానంలో కొత్త డీసీసీ అధ్యక్షుడు నియామకం అవుతారని భావించిన నేతలు డీసీసీ కోసం ప్రయత్నాలు సాగించారు. దాదాపు పదేళ్లు డీసీసీ అధ్యక్షుడి గా పనిచేసిన మానాల సైతం పార్టీ కార్యకలాపాల్లో మునుపటి లా క్రియా శీలకంగా పనిచేయడం లేదు. హైదారాబాద్ లేదంటే బాల్కొండ సెగ్మెంట్ లకే ఎక్కువగా పరిమితం అవుతున్నారు.

మరో వైపు సుదీర్ఘ కాలంగా అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా పనిచేస్తున్న కేశ వేణు కు నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ గా నియామకం అయ్యారు.దీనితో ఆయనే పార్టీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని పార్టీ పెద్దలను కోరుతూ వస్తున్నారు. వేణు స్థానంలో అర్బన్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అర డజన్ మంది లైన్ లోకి వచ్చారు.

డీసీసీ మానాల మోహన్ అర్బన్ లో కేశ వేణు ల సారథ్యంలో గతంలో లోకల్ బాడీ ఎన్నికలో ఘోర పరాజయం ఎదురయ్యింది. అందుకే ఈసారి లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోవీరి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలనేది పార్టీ వర్గాల వాదనగా ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!