లోకసభ ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్సీ కవిత వచ్చే అవకాశం లేకుండా పోయింది. శుక్రవారం ఆమెకు హైకోర్టు లోను ఊరట దక్కలేదు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
విచారణను ఈ నెల 24కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఆమె బెయిల్ పిటిషన్ లను రౌస్ అవెన్యూ కోర్టు ఇదివరకే కొట్టేసింది కానీ.
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో తాను ఒక్కరినని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలనిబెయిల్ ఇవ్వాలని హైకోర్టు ను ఆశ్రయించారు. శుక్రవారం హైకోర్టు లో ఈ పిటిషన్ మీద విచారణ జరగాల్సి ఉండగా దీనిని ఈ నెల 24కు వాయిదా వేసింది.
దీంతో కవిత 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికివచ్చే ఛాన్స్ లేకుండా పోయింది. ఆమె నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసారు. 2014 లో గెలిచి 2019 లో ఓడిపోయారు.