ఈసారి ఎన్నికల్లో ఎంపీ గెలిస్తే యువత ఉపాధి తో పాట వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు జిల్లాకు వచ్చేలా పనిచేస్తానని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు ఆయన శుక్రవారం బీజేపీ కార్యాలయంలో విజన్ డాకుమెంట్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పసుపు వరి మొక్కజొన్న మామిడి ఆధారిత పరిశ్రమలు తేవడమే కాదు మద్దతూ ధర కూడా వచ్చేలా చేస్తానన్నారు కేంద్ర ప్రభుత్వ నూతన విధానాలకు అనుగుణంగా చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తాన్నారు.
జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు తో పాటు ఆర్మూర్ నుండి అదిలాబాద్ రైల్వే లైన్ ముద్గేట్ నుండి డోన్ వయా నిజాంబాద్ రైల్వే లైన్ డబ్బింగ్ బోధన్ నుండి బీదర్ నూతన రైల్వే లైన్ ప్రారంభించడం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలలో నియోజకవర్గానికి కనెక్టివిటి అయ్యేలా చేస్తాను
నూతన రైల్వే లైన్లతో డబ్లింగ్ పనులతో రవాణా సౌకర్యాలు మురుగు పడనున్న దృష్ట్యా ముందస్తుగానే ఇంగ్లాండ్ కంటైనర్ డిపో ఐ సి డి లు నెలకొల్పడం ద్వారా లాజిస్టిక్ సపోర్టు
మల్టీ నేషనల్ కంపెనీల సిఎస్ఆర్ నిధులతో భారీ స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాన్నారు
విలువ ఆధారిత పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా కనీసం పాతికవేల మందికి పైగా యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలను కల్పించడం
కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ సాధ్యమైనంత త్వరగా రేషన్ కార్డులు ఇప్పించడానికి కృషి చేస్తాను
బీడీ కార్మికుల కోసం ప్రత్యేకంగా 5 వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కార్పొరేటర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు