పట్టబద్రుల వోట్లతో ఎమ్మెల్సీ గా గెలిచిన జీవన్ రెడ్డి ఐదేళ్లు పత్తాలేకుండా పోయారని ఇప్పుడు ఎంపీ గా గెలిపించాలని మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని బిఆర్ యస్ బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు.
బుడ్డర్ ఖాన్ ఏషాలు వేసే అర్వింద్ సొల్లు మాటలు విని మరోసారి మోసపోవద్దని ఆయన కోరారు ఐదేళ్లు ఎంపీగా ప్రజలకు చేసింది ఏమిలేదు కనుకే మోడీ మొఖం చూసి ఓట్లు అడుగుతుండుని అరవింద్ ఒక్కడు ఓడినా నరేంద్ర మోదీకి జరిగే నష్టం ఏమీలేదన్నారు.
నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరం వద్ద నుండి ఇంటింటి ప్రచారంలో పాదయాత్ర లో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ , మాజీ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా ,తో కలిసి ఇంటింట ప్రచారం చేసుకుంటూ..కోటగల్లీ గొనె రెడ్డి కళ్యాణ మండపం లో పబ్లిక్ మీటింగ్ నిర్వహించారు.
రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయనందుకు కాంగ్రెస్ కు ఓటు వేయాలా..? కళ్యాణలక్ష్మి కింద ఆడ బిడ్డలకు తులం బంగారం హామీని తప్పినందుకు కాంగ్రెస్ కు ఓటు వేయాలా..? ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకుండా అడిగిన అన్నార్తులను చెప్పుతో కొడతామని కండ కావరంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ మంత్రులను చూసి ఓటు వేయాలా..?తాను ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఆర్మూర్ బాన్సువాడ, నిజాంబాద్ రూరల్ గెలిచిన వ్యక్తిని మీ ప్రాంతాల్లో మీకు తెలిసిన వ్యక్తులను అడగండి బాజిరెడ్డి గోవర్ధన్ ఎటువంటి వారు అని…
ఇప్పుడు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిన్నారు జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్ శ్రీనివాస్ గారి హయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంబాద్ జిల్లాకు ఇసుమంతైన అభివృద్ధి చేశారా… అభివృద్ధి చేసే వారిని ఆశీర్వదించండి.కుటుంబంలో మూడు పదవులు ఉండి..
నిజాంబాద్ ఏమీ చేయని వ్యక్తులు… కావాలా… ప్రజల మనిషి బాజిరెడ్డి గోవర్ధన్ కావాలా..ప్రజలు ఆలోచించాలి ఎంపీ గెలిచిన అరవింద్ ఐదేళ్లలో ఏం చేశారు.. దయచేసి ప్రజలు ఆలోచి.. ఓటు వెయ్యాలా…కానీ కవిత బీడీ కార్మికుల బాధలను కష్టాలను చూసి, వారందరూ బాధపడుతున్నారని ఉద్దేశంతో..
సీఎం కేసీఆర్ వారి తండ్రిని పట్టు పట్టి వీడి పెన్షన్ మంజూరు చేయించిన ఘనత కవిత దెన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మున్న ఇచ్చిన ఆరు గారెంటీ అమల్లో 4000 పింఛన్ ఇస్తానని చెప్పారు వచ్చాయా మరి..ఓట్ల కోసం.. సీట్ల కోసం మాయమాటలు చెప్పి మభ్య పెట్టడానికి వస్తున్న రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన చారిత్రక బాధ్యత కూడా మనపైనే ఉంది..
లేకుంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వలనే తెలంగాణను తెర్లు చేస్తున్న పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగడానికి మనమే అవకాశం ఇచ్చినవారం అవుతాం.. అలాంటి రాజకీయ గుంట నక్కలతో అప్రమత్తంగా ఉండాలి, వచ్చే 13 తారీకున కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అని పేర్కొన్నారు.












