ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న జీవన్ రెడ్డి మాల్ కు సంబంధించి జీఎస్టీని తాను రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడో చెల్లించానని అని కేంద్ర ప్రభుత్వానికి చెల్లించకుండా ఆర్టీసీ ఎండీ ఫ్రాడ్ చేశారని కేంద్రానికి జీఎస్టీ కట్టకుండా మోసం చేస్తున్న సజ్జనార్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బిఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి డిమాండ్ చేసారు ఏపీ లో డీజీపీని తప్పించినట్లే సజ్జనార్ ను కూడా విధుల్లో నుంచి తప్పించాలన్నారు ఒక క్రిమినల్ మైండ్ అని సైబరాబాద్ కమిషనర్ గా పని చేస్తున్న కాలంలో వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడా పెట్టారని ఆరోపించారు కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిందని ఆర్టీసీ అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని .
జీఎస్టీ బకాయిలు చెల్లించాలంటూ ఆర్టీసీ అధికారులు నోటీసులు జారీ చేయడం ఎన్నికల కొడుకు విరుద్ధమని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఈ మేరకు ఆ ఈ విషయమై ఆర్టీసీ అధికారులపై ఎన్నికల నియమాలు ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తాలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 8న రాత్రి ఆర్మూర్లో బహిరంగ సభలో తన పేరును ప్రస్తావించారని ఆ మరుసటి రోజే ఆర్టీసీ ఎంటీ సజ్జనార్ నిజామాబాద్ కు వచ్చారని.
ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న జీవన్ రెడ్డి మాల్ కు సంబంధించిన అంశం హైకోర్టులో న్యాయపరమైన వివాదంలో ఉందని అన్నారు. అయినప్పటికి ఆర్టీసీ అధికారులు పోలీసులతో వెళ్లి హంగామా చేశారన్నారు నిజాంబాద్ లోకసభ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో స్పష్టమైందని అలాగే బిజెపి చేసిన సర్వేలను బాజిరెడ్డి గెలుస్తున్నట్లు తేలిందని ఆయన అన్నారు.
బిజెపి కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా జిల్లాలో టిఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి మాల్ అంశాన్ని తెర మీదకి తెచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.