Monday, June 16, 2025
HomeCRIMEనిర్లక్ష్యంతో... నిండు ప్రాణం బలి - ప్రాణానికి ఖరీదు కట్టే ప్రయత్నం చేసిన వైద్యులు-కల్లెడ గ్రామానికి...

నిర్లక్ష్యంతో… నిండు ప్రాణం బలి – ప్రాణానికి ఖరీదు కట్టే ప్రయత్నం చేసిన వైద్యులు-కల్లెడ గ్రామానికి చెందిన సుమలత అని 25 సంవత్సరాల బాలింత మృతి

నిర్లక్ష్యంతో… నిండు ప్రాణం బలి – ప్రాణానికి ఖరీదు కట్టే ప్రయత్నం చేసిన వైద్యులు-కల్లెడ గ్రామానికి చెందిన సుమలత అని 25 సంవత్సరాల బాలింత మృతి – వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందారని బంధువులు ఆరోపణ – ఆస్పత్రి ఎదుట మెడికల్ అసోసియేషన్ వైద్యులకారపు అడ్డం తిరిగి ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు

జాన రమేష్: ఇది సంగతి;

ఆర్మూర్:పురిటి నొప్పులతో గంపెడు ఆశలతో ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణీ వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయింది. పండంటి శిశువుకు జన్మనిచ్చి తన ప్రాణాలను కోల్పోయింది . దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద శ్రీ తిరుమల ఆసుపత్రిలో జరిగింది.

ఆర్మూర్ పట్టణంలోని శ్రీ తిరుమల హాస్పిటల్లో పిట్ల సుమలత(25) అనే బాలింత ఆస్పత్రి వైద్యురాలు శ్రీదేవి వడ్లమూడి నిర్వాకం వల్ల ప్రాణాలను కోల్పోయిందని మృతురాని బంధువులు ఆరోపించారు. మృతురాలి భర్త సాయిలు 5 నెలల క్రితమే ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళాడు. మృతురాలికి ఇదివరకే రెండు నార్మల్ డెలివరీలు జరిగాయి. కాగా మూడవ కాన్పు కోసం శ్రీ తిరుమల హాస్పిటల్ లో చేరారు.

వైద్యురాలు సుమలత ఆరోగ్యం బాగాలేదని నార్మల్ డెలివరీ కాకుండా సర్జరీ చేసి డెలివరీ చేయాలని చెప్పడంతో బంధువులు సరేనన్నారు. సర్జరీ అనంతరం మగ బిడ్డకు జన్మనిచ్చింది మృతురాలు. మగ బిడ్డ పిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా బాధితురాలు కడుపులో మంటగా ఉందని వాపోయిందని బంధువులు తెలిపారు.

ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా వైద్యురాలు అనస్తీసియా డాక్టర్ని కాదని తానే మత్తుమందు ఇవ్వడంతో మృతురాలు హార్ట్ బీట్ పెరిగి గుండెపోటుతో చనిపోయిందని మృతి రాలి బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయి 24 గంటలు అయినా ఆసుపత్రి వర్గాలు ఎటువంటిచర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలికి న్యాయం చేయాలని, డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు బంధువులు రోడ్డుపై బైఠాయించి హాస్పిటల్ ముందు రాస్తారోకో చేశారు.

ఇదిలా ఉండగా ఆర్మూర్ మెడికల్ అసోసియేషన్ కు చెందిన పలువురు పట్టణ వైద్యులు బాలింత ప్రాణానికి ఖరీదు కట్టే ప్రయత్నం చేశారు. తమకు న్యాయం చేసి వరకు కదిలించబోమని మెడికల్ అసోసియేషన్ కు చెందిన వైద్యుల కారుకు అడ్డంగా నిలిచి తమకు న్యాయం చేయాలని మృతురాలి పిల్లలను వారి ఎదుట నిలబెట్టి న్యాయపోరాటం చేస్తున్నారు.

దీంతో ఆర్మూర్ ఎసిపి బస్వా రెడ్డి , యస్ హెచ్ ఐ రవి కుమార్ లు చేరుకుని మృతురాలి బంధువులను శాంతింపజేసేల ప్రయత్నం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!