ఎన్నికల ప్రచార గడువు పూర్తీ కావడానికి ఇంకా ఒక రోజు గడువు వుండగానే ప్రలోభాల పర్వానికి తెరలేచింది. దాదాపు 20 రోజులపాటు క్షేత్ర స్థాయిలో ప్రచారానికే వ్యూహరచనలు చేసిన అభ్యర్థులు ఇక తెరచాటు వ్యూహాల కు పదను పెడుతున్నారు.
నలువైపు వైపులా చుట్టేసిన వోట్ల కోసం అభ్యర్తించిన నేతలు ఇప్పుడు గంప గుత్తగా వోట్లు రాబట్టేకార్యాచరణలో ఉన్నారు. ఎన్నికలు ఏవైనా సరే కుల సంఘాలతోనే ప్రలోభాలు మొదలవుతాయి.
అభ్యర్థులిచ్చే మద్యం డబ్బు కోసం ఆయా కుల సంఘాలు వెంపర్లాడుతాయి. అభ్యర్థులిచ్చే నజరానాలా కోసం వారి ఇండ్ల వద్ద పడిగాపులు పడుతాయి. అసలు కుల సంఘాల పెద్దలు చెప్తే ఆ సంఘం సభ్యులు వోట్ల సంగతి ఎలా ఉన్న కనీసం కుటుంబ సభ్యులైన అనుకూలంగా వోట్లు వేస్తారా అంటే గ్యారెంటీ లేదు.
కానీ వారిచ్చే బిల్డప్ లతో అభ్యర్థులు ఇట్టే బోల్తా పడుతారు. అయినకాడికి బేరం మాట్లాడుకుంటారు. నిజామాబాద్ లోకసభ ఎన్నికల్లో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేసారు. ఇప్పుడు ప్రలోభాలకు తెరలేపారు. జాతీయ పార్టీ కి చెందిన అభ్యర్థి తన సామజిక వర్గం వోట్ల ను గంప గుత్తగా కొల్లగట్టడానికి రంగంలోకి దిగారు.
దశాబ్దాల తరబడి గా తమ ఆధిపత్యమే సాగుతున్నది. అందుకే తన సంఘం మద్దతు కూడగట్టడం అనివార్యంగా భావించిన సదురు అభ్యర్థి ఒక్కో సంఘానికి రూ 10నుంచి 20 నగదు తో పాటు మద్యం బాటిళ్లు సైతం పంపిణీ చేసారు.
ఆ మరుసటి రోజే ఆయా తర్ప లకు చెందిన కుల ప్రతినిధులతో ఓ హోటల్ లో భేటీ అయ్యారు. విషయం తెలిసి మరో జాతీయ పార్టీ నేతలు తమ అభ్యర్థి ని అప్రమత్తం చేసారు. ఎహే నగరంలో తమ కుల సంఘం మొత్తం మా కనుసైరాల్లో వుందని బుకాయించి కులసంఘాల కు నజరానాలు ముట్టజెప్పే పనిలో ఉన్నారు.
ప్రధాన పార్టీల్లో ఉండే కీలక నేతలు తమ కుల సంఘాలను ముందు పెట్టి వారి పేరున అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు.