కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి..ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పసుపు రైతుల మీద లేదని, నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పసుపు రైతుల కోసం అలుపెరుగని పోరాటం చేశానన్న కవిత మాట్లాడిన మాటలు వింటుంటే ప్రజలు, పాత్రికేయలే కాకుండా టిఆర్ఎస్ నాయకుల సైతం నవ్వుకుంటున్నారన్నారనీ ఎద్దేవ చేశారు.
ప్రతీ మూడేళ్లకోసారి పసుపు ధర పెరుగుతుందని, అందులో ఎంపీ అర్వింద్ గొప్పతనం ఏమీ లేదని కవిత అన్నారని, మరి కవిత ఐదేళ్లు ఎంపీగా ఉన్నప్పుడు పసుపు ధర ఎందుకు పెరగలేదనీ ప్రశ్నించారు.
కవితకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం పసుపు రైతుల కొరకు వేల్పూర్ లో స్పైసెస్ పార్క్ కొరకు 42 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింనపుడు, కనీసం ఒక వ్యవసాయాధార పరిశ్రమని కూడా ఎందుకు తేలేకపోయారనని తెలిపారు.
ప్రోటోకాల్ గురించి కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందని, 10 సంవత్సరాల టి(బీ)ఆర్ఎస్ నాయకులు ఏనాడైనా ప్రోటోకాల్ పాటించారా అని ప్రశ్నించారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
