రోడ్డు భద్రత పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిజామాబాద్ శివాజీ నగర్ లో గల రామకృష్ణ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్.. మాట్లాడుతూ మైనర్లు బైకులు డ్రైవ్ చేయొద్దని చెప్పి హెల్మెట్ లేకుండా లైసెన్సులు సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేయొద్దనీ హెచ్చరించారు.
అదేవిధంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణం చేయమని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్, ఐరాడ్ జిల్లా మేనేజర్ వర్షా నిహాంత్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
