HomeTelanganakamareddyపార్టీ వీడినందుకు …బాయి లో దూకి పోచారం చావాలి ….బాన్స్ వాడ ఎన్నికల సభ లో...

పార్టీ వీడినందుకు …బాయి లో దూకి పోచారం చావాలి ….బాన్స్ వాడ ఎన్నికల సభ లో కేటీఆర్

ప్రాణం ఉన్నంత వరకు కెసిఆర్ వెంటే వుంటా అని దేవుని ప్రాంగణం లో మాటిచ్చి రేవంత్ సంక లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి బండ కట్టుకొని బాయి లో దూకి చావాలని ఇలాంటి దిక్కుమాలిన నేతకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బిఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు ఆయన శనివారం బాన్స్ వాడ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు

ఈ సందర్భంగా మాట్లాడారు. పదేళ్ల కాలం లో కెసిఆర్ బాన్స్ వాడ నుంచి గెలిచిన పోచారం కు ఏ తక్కువ చేసాడని మొదట వ్యవసాయ మంత్రి ని చేసాడు లక్ష్మి పుత్రుడంటూ పదే పదే సంబోదించేది ఆతర్వాత స్పీకర్ ని చేసాడు నియోజకవర్గానికి వందలది కోట్లు విలువైన నిదులు ఇచ్చాడన్నారు గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డి ఇదే బాన్స్ వాడ లో పోచారం ను ఉద్దేశించి ఆంబోతు ఆయన కొడుకులను దున్నపోతులు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసాడని కేటీఆర్ గుర్తు చేశారు.

అలాంటి రేవంత్ పంచ లోకి పోచారం ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు వోట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన ఎలా ద్రోహం చేశాడన్నారు.ఎన్నో హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నిలువునా వంచించిందన్నారు 4 వేల పెన్షన్ తులం బంగారం నిరుద్యోగ భృతి మహిళా కు రెండు వేలు మైనార్టీ సబ్ ప్లాన్ లాంటి హామీలు గాలికి వదిలేసాడని కెసిఆర్ ఇచ్చిన రైతు బంధు బీమా కల్యాణ లక్ష్మిపథకాలు మరుగున పడేశారని దుయ్య బట్టారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments