Thursday, April 30, 2026
HomeCRIMEపంచాయతీ కార్యదర్శి వేధింపులతో కారోబార్ ఆత్మహత్య ..

పంచాయతీ కార్యదర్శి వేధింపులతో కారోబార్ ఆత్మహత్య ..

పంచాయతీ కార్యదర్శి వేధింపులతో కారోబార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బోధన్ మండలం లోని పెంటకుర్ద్ లో చోటు చేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన నీరుడి బాబు (38), బోధన్ మండలం లోని పెంటకుర్ద్ గ్రామములో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మృతుడి భార్య నీరుడి కవిత ఫిర్యాదు ప్రకారం..

పెంటకుర్ద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉదయభాస్కర్ గత కొంతకాలంగా తన భర్తను మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. గ్రామంలో ఇంటి పన్నులు వసూలు చేసి ఇచ్చినప్పటికీ, లెక్కల్లో తేడాలు ఉన్నాయంటూ అందరి ముందు అవమానించారని, తన భర్త గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ఈ వేధింపుల వల్లే మనస్తాపానికి గురై ఈ క్రమంలో, ఈ నెల 5వ తేదీ ఉదయం బాబు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

దీనికి సంబంధించి బాబు రాసిన ఆత్మహత్య లేఖ కూడా లభ్యమైందని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాబు మృతి చెందారనీ తెలిపారు.

తన భర్త మృతికి కారణమైన పంచాయతీ కార్యదర్శి ఉదయభాస్కర్‌ పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని భార్య కవిత దరఖాస్తు ఇవ్వగా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!