HomeTelanganakamareddyడిచ్ పల్లి జాతీయ రహదారి మీద బైఠాయించిన కేటీఆర్

డిచ్ పల్లి జాతీయ రహదారి మీద బైఠాయించిన కేటీఆర్

బిఆర్ యస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ డిచ్ పల్లి జాతీయ రహదారి మీద గురువారం బైఠాయించారు. ఆయన ఎదో బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలతో కలిసి ఆయన ఆందోళనలో పాల్గొన్నారు.

ఆదిలాబాద్ కు కారు పార్టీ సమావేశాలలో పాల్గొనడానికి వెళ్తున్న కేటీఆర్ డిచ్ పల్లి వద్ద జాతీయ రహదారి మీద బెటాలియన్ పోలీసు కుటుంబాలు రాస్తా రోకో చేస్తున్నారు.

దీనితో ఆయన కూడా వారితో పాటు ఆందోళనకు దిగి వారితో సమావేశం అయ్యారు. తమ ఆవేదన వెళ్లగక్కారు. అయితే గురువారం తెలంగాణల వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులభార్యలు రోడ్డెక్కారు. ఆయా బెటాలియన్ ల ఎదుట పోలీసుల భార్యలు గురువారం ధర్నా నిర్వహించారు.

పలు ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల భార్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి డ్యూటీకి చేస్తున్న పనికి సంబంధం లేదని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడే పోలీస్‌ వ్యవస్థలో ఏక్‌ పోలీస్‌ విధానాన్ని అనుసరించడం లేదని ఆవేదన చెందుతున్నారు. శాంతి భద్రతల కోసం రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ కానిస్టేబుళ్లు వెట్టిచాకిరీ చేస్తున్నా..

వారి కుటుంబాల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. విధి నిర్వహణ పేరుతో ప్రభుత్వం వారిని కుటుంబాలకు దూరం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఒకే పోలీస్‌ విధానం ఉండాలనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments