Saturday, April 25, 2026
HomeCRIMEనగరంలో గంజాయి పట్టివేత..

నగరంలో గంజాయి పట్టివేత..

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 1.110 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్న ఘటన నాగారంలో బుధవారం చోటు చేసుకుంది.

ప్రొహిబి షన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి ఆదేశాల మేరకు నాగారంలో ఓ వ్యక్తి గంజాయి రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయ సమా చారం మేరకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలో నాగారంలోనీ హనుమాన్ గుడి వెనకాల 80 క్వాటర్ కు చెందిన సాజీద్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. వారిని పట్టుకుని తనిఖీ చేయగా అతని వద్ద 1.110 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈమేరకు ద్విచక్ర వాహనం సీజ్ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఫోసిమెంట్ అధికారులు వెల్లడించారు.

ఈ తనిఖీలో ఎక్సైజ్ ఎస్సై టి సుస్మిత సిబ్బంది ప్రభాకర్, షాబ్బిరుద్దీన్, దారి సింగ్, సునీల్,నిసార్ మియా పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!