సౌదీ అరేబియా రాజధాని రియాద్ లోని భారత రాయబారి డా. సూహెల్ ఎజాజ్ ఖాన్ ను మాజీ ఎంపీ, ప్రముఖ కార్మిక నాయకుడు రామచంద్ర కుంతియా బృందం మంగళవారం ఎంబసీ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా జరిగిన చర్చలలో ఉప రాయబారి అబూ మాతెన్ జార్జి, సామాజిక సంక్షేమ అధికారి మెయిన్ అఖ్తర్ లు పాల్గొన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గల్ఫ్ వలస కార్మిక నేత మంద భీంరెడ్డి, రియాద్ లోని సామాజిక సేవకురాలు చేతన జగదీష్గారి, గ్లోబల్ తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షులు మహ్మద్ జబ్బార్ లు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.
ఈనెల 29, 30 రెండు రోజుల పాటు రియాద్ లో జరుగనున్న గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్ లో పాల్గొనటానికి కుంతియా సౌదీ పర్యటనలో ఉన్నారు.
