బొల్లారం ఆర్మీ మద్రాస్ రెజిమెంట్ క్యాంప్ సమీపంలో ఉన్న ఫైరింగ్ రేంజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభ్యం అయ్యాయి ఒక ప్లాస్టిక్ బకెట్‌లో ఉంచిన 160 డిటోనేటర్లను అధికారులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పేలుడు పదార్థాలున్న బకెట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఒక్కో బండిల్‌లో 20 చొప్పున మొత్తం 8 బండిళ్లలో భద్రపరిచిన డిటోనేటర్లను ఆ బకెట్ లో ఉన్నాయి వీటిని నిర్వీర్యం చేసే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవలే మద్రాస్ రెజిమెంట్ సెంటర్‌లో అత్యాధునిక ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రి చోరీకిఅయ్యాయి.దీనిపై స్థానిక పోలీసులు మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులతో కల్సి దర్యాప్తు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పేలుడు పదార్థాలు లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది
