నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వులు బుధవారం వెలువడ్డాయి.
నిజామాబాద్‌లో ఎక్సైజ్ ఎస్హెచ్ఓ పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్ స్వప్నను వరంగల్ అర్బన్‌కు బదిలీ చేయగా.. ఆమె స్థానంలో సిద్దిపేట డిపీఎఫ్ ఎస్‌హెచ్‌వో సరితను నిజామాబాద్‌కు బదిలీ చేశారు.
అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్‌ను మెదక్‌కు, మరో ఇన్‌స్పెక్టర్ బాలకిషన్‌ను ఖమ్మం జిల్లా మధిరకు బదిలీ చేశారు. నిజామాబాద్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న మల్లేష్‌ను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
