స్థానిక ఎన్నికలలో బీజేపీ టికెట్ కోసం అన్ని పార్టీల నాయకులు ప్రయత్రిస్తున్నారనీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. శనివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యకతన సేవా పక్షం జిల్లా కార్యాశాల ఘనంగా నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇందూరు పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. జిల్లాలో స్థానిక సంస్థలన్నీ బీజేపీ కైవసం చేసుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నాయకులు బీజేపీ టికెట్ కోసం క్యూ కడుతున్నారని, గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ గెలువదు అని స్వయంగా ఫోన్స్ చేస్తున్నారు. కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు మాకు బీజేపీ టికెట్ ఇవ్వండి అని మోర పెట్టుకుంటున్నారనీ అన్నారు. ఇందూరు అన్ని స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకుంటుంది.
కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో కూడా అదే విధంగా బీజేపీ జెండా ఎగరబోతుంది” అని తెలిపారు. జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ
కార్యకర్తలే పార్టీ బలం.
సేవ, సమర్పణ భావంతో ప్రతి ఇంటికి బీజేపీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలి. సేవా పక్షం లో భాగంగా ప్రతి బూత్ స్థాయిలో కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అని అన్నారు.కార్యక్రమంలో పసుపు బోర్డు చేర్మెన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, జిల్లా,నగర, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
