అంబులెన్స్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటన నగరంలోని బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే.. మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామానికి చెందిన భూమయ్య ను నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి అతి వేగంగా వస్తున్న ఓ లారీ అంబులెన్స్ ను ఢీ కొట్టినట్లు తెలిపారు.
దీంతో అంబులెన్స్ డ్రైవర్ రమేష్ కు కాలుకు తీవ్రగాయామ అయింది. మరియు ఈఏమ్ టి నాగిణి కి వెన్నులో బలమైన గాయం అయ్యింది. వీరిని హుటహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి పారిపోతున్న మరోక లారీని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి బైక్ పై వెళ్లి ఆపిపట్టుకుని పోలీసులకు అప్పగించారు. రూరల్ పోలీసులు అక్కడికి చేరుకోని కేసునమెదుచేసుకోని లారీని రూరల్ పోలీసు స్టేషన్ తరలించారు.
