HomeCRIMEదొంగతనం జరిగిన ATM సెంటర్ స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్

దొంగతనం జరిగిన ATM సెంటర్ స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్

నేడు 19-8-2025 తెల్లవారుజామున టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో SBI బ్యాంక్ ATM లో గుర్తు తెలియని నేరస్తులు గ్యాస్ కట్టర్ తో ఏటీఎంలో ప్రవేశించి దొంగతనం కొరకు ప్రయత్నం చేయగా అలర్ట్ మెసేజ్ అందుకున్న టౌన్ 3 పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకోగా వారు ఈకో వ్యాన్లో పారిపోయి పాల్ద గ్రామ శివారులో వ్యాన్ వదిలేసి పారిపోయారు.

ఈ సంఘటన స్థలాన్ని ఏటీఎం సెంటర్ ను గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీపి. సాయి చైతన్య, ఐపిఎస్., గారు సందర్శించి , నేరం జరిగిన విధానాన్ని పరిశీలించి ఎస్సై హరిబాబు, సిఐ శ్రీనివాస్ రాజు లకు సూచనలు ఇచ్చి వీలైనంతవరకు త్వరగా నేరస్తులను పట్టుకోవాలి అని ఆదేశించారు. క్లూస్ టీం , సిసిఎస్ టీం అధికారులకు కేసు పరిశోధనకు సంబంధించి తగు ఆదేశాలు జారీ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments