నగరంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని సారంగాపూర్ హెచ్ పి పెట్రోల్ పంపు వద్ద సయ్యద్ వసీం ఓ ఆటోలో గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు నిర్వహించి అతన్ని పట్టుకున్నట్లు తెలిపారు.
నిందితుడి నుంచి 100 గ్రాములు ఎండు గంజాయి,ఒక సెల్ ఫోన్,ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అలాగే ఎక్కడైనా గంజాయి రవాణా,విక్రయం జరిగిన 8712658970 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు.
ఈ దాడిలో రామ్ కుమార్,హమీద్, విష్ణు, అవినాష్,భోజన్న పాల్గొన్నారు.
