నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి పరిశీలించారు.
జైతాపూర్ లో 74 ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభమై, వివిధ దశలలో కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వీటిలో 15 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్మాణాలు పూర్తి అయిన ఇండ్లను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ, ఒక్కో ఇంటి వారీగా పరిశీలన జరిపారు. ఒకటి, రెండు ఇండ్లకు సంబంధించి తుది దశలో అసంపూర్తిగా ఉన్న చిన్న చిన్న పనులను గుర్తించిన కలెక్టర్, యుద్ధప్రాతిపదికన వాటిని పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్ళకు బిల్లుల చెల్లింపులు పూర్తి స్థాయిలో జరిగాయా? అని ఆరా తీశారు.
చివరి విడతగా లక్ష రూపాయలు రావాల్సి ఉందని లబ్దిదారులు తెలుపగా, వెంటనే లబ్దిదారుల ఖాతాలలో బిల్లులు మంజూరు చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ళకు విద్యుత్ కనెక్షన్, మిషన్ భగీరథ నీటి సరఫరా వంటి సదుపాయాలను సత్వరమే కల్పించాలని ట్రాన్స్కో ఏ.ఈ ముఖ్తార్ ను, ఆర్.డబ్ల్యు.ఎస్ డీ.ఈ రాకేష్ లకు సూచించారు.
ప్రారంభోత్సవాల నాటికి, ఏ ఒక్క చిన్న పని కూడా పెండింగ్ లో లేకుండా, అన్ని వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ఇళ్ళ ఆవరణలో ఖాళీ స్థలం ఉన్న చోట పూలు, పండ్ల మొక్కలు నాటించాలని అన్నారు.
ఇళ్ళ నిర్మాణాలకు ముందుకు రాని వారి స్థానంలో, అర్హులైన ఇతర లబ్దిదారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. కాగా, ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల విషయంలో అనవసర ఆడంబరాలకు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని ఈ సందర్భంగా కలెక్టర్ లబ్దిదారులకు హితవు పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మొదటి విడతలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలోనే వాటికి ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందని తెలిపారు.
జైతాపూర్ లో 15 ఇండ్లు ఇప్పటికే పూర్తయ్యాయని, వారం రోజుల్లో వాటికి ప్రారంభోత్సవాలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ల
