నిజామాబాద్ పట్టణంలోని నాగారం ప్రాంతంలో వెలసిన ప్రాచీన నందిగుట్ట శివాలయం మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కళకళలాడింది.
పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై భజనలు, అభిషేకాలు, రుద్రపారాయణం నిర్వహిస్తూ భక్తిరసంలో మునిగిపోయారు.
ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించగా, భక్తులు సద్వినియోగం చేసుకున్నారు.
