నగరంలో ని పురాని హవేలీ లోని సిటీ సివిల్ కోర్టులో ఆధునీకరించిన బార్ అసోసియేషన్ హాల్ ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు అదనపు న్యాయమూర్తులు జస్టిస్ రేణుక యారా, జస్టిస్ నందికొండ నర్సింగరావు ప్రస్తుత సిటీ సివిల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వై పద్మ ఈ కార్యక్రమంలో ఉన్నారు
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ మాట్లాడుతూ కొత్తగా వృత్తి లోకి వస్తున్న వారు విలువలు పాటించాలని సీనియర్ లను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన బార్ అసోసియేషన్ వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు .
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై శ్రీనివాసచారి, వైస్ ప్రెసిడెంట్ కొత్త కాపు ప్రవీణారెడ్డి,జనరల్ సెక్రెటరీ డి హర్షవర్ధన్, జాయింట్ సెక్రెటరీ బార్క రాజేష్ కుమార్ , లైబ్రరీ సెక్రెటరీ వి.సుదాంష్ కుమార్ , ట్రెజరర్ టి.విశాల్ సింగ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ ఆర్ సైదిరెడ్డి ,లేడీ రిప్రెజెంటేటివ్ ఎస్ జస్వంత్ కౌర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కే అశోక్ ,కే భానుచందర్, మహమ్మద్ బార్కతలి, వాసా మధుసూదన్ ,వి వినోద్ కుమార్, సరితా మిశ్ర,N. రాజు మరియు ఇతర న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
