HomeCRIMEహైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదంఅగ్నిప్రమాదంలో 17 మంది మృతి..

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదంఅగ్నిప్రమాదంలో 17 మంది మృతి..

హైదారాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ దగ్గర జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 17కి చేరింది.

ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో నగరమంతా ఉలిక్కిపడేలా చేసింది. కృష్ణా పెరల్స్, మోడీ పెరల్స్ షాపులతో పాటు ఇళ్లకూ మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఏసీ కారణంగా మంటలు చెలరేగగా అక్కడే ముగ్గురు మరణించారు.

ప్రమాద సమయంలో భవనంలో నాలుగు కుటుంబాలు ఉండగా 14 మందిని అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేశారు. మంటల కారణంగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లినవారిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ఊపిరాడక అపోలో ఆస్పత్రిలో ఇద్దరు, యశోద ఆస్పత్రిలో మరో ఐదుగురు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments