నగరంలోని గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఒకట టౌన్ సీఐ రఘుపతి తెలిపారు.
సోమవారం సాయంత్రం నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మోపాల్ శ్రీరామ్ నగర్ కు చెందిన భామన్ జైల్ సింగ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకొని విచారించి అతని బ్యాగ్ లో వేతగగా 210 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఆ గంజాయిని ఇతరులకు విక్రయించడానికి తీసుకొచ్చినట్లు నిజం ఒప్పుకున్నాడని తెలిపారు. వ్యక్తినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతి పేర్కొన్నారు.
