HomeCRIMEప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి కింద పడి వ్యక్తి మృతి..

ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి కింద పడి వ్యక్తి మృతి..

ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నందిపేట్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం… నందిపేట్ మండలంలోనీ రైతు ఫారం కు చెందిన బొంకంపల్లి సాయిలు (55).

కూలీ పనులు చేసుకుంటారు. ఈ మేరకు ఆంధ్ర నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను నరికే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడి తలకు తీవ్రమైన గాయం అవ్వడంతో మృతి చెందినట్లు తెలిపారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిపేట్ ఎస్సై హరిబాబు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments