రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన నిజామాబాద్ రూరల్ మండలంలో చోటు చేసుకుంది.రూరల్ ఎస్ఐ మొహమ్మద్ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం…
కొత్తపేట గ్రామానికి చెందిన బొడిగే నరస గౌడ్(65).వృతి కల్లు గీత కార్మికుడు. వృత్తి రిత్యా తాళ్ళలకు వెళ్ళే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మొహమ్మద్ ఆరీఫ్ తెలిపారు.