HomeCRIMEమావోయిస్టు పార్టీ భారీ ఎదురు దెబ్బ ……..ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ……ఇద్దరు తెలంగాణ నేతలు

మావోయిస్టు పార్టీ భారీ ఎదురు దెబ్బ ……..ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ……ఇద్దరు తెలంగాణ నేతలు

మావోయిస్టు పార్టీ మరోసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. కేంద్ర బలగాల వేట ఒరిస్సా చత్తీస్ గఢ్ సరిహద్దు లో దండకారణ్యం కు విస్తరించింది. గరియాబంద్ జిల్లా కుల్హాది ఘాట్ అడవుల్లో సోమవారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ లో జరిగింద.14 మంది నక్సలైట్లు మృతి చెందారు.

ఒక మహిళా నక్సలైట్ కూడా ఉన్నారు.సెంట్రల్ కమిటీ మెంబర్, పార్టీ కీలక నేత చలపతి అలియాస్‌ రామచంద్రా రెడ్డి అలియాస్‌ జైరామ్‌ కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న చలపతి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. చలపతి హెడ్‎పై రూ.కోటి రివార్డు ఉంది .

ఈ ఎన్ కౌంటర్‎లో ప్రస్తుతం 14 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు ధృవీకరించారు. ఘటన స్థలంలో కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం 14 మృతుల్లో ఇద్దరు తెలంగాణ కు చెందిన వారున్నారు .

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ  సభ్యుడు పాక హన్మంతు అలియాస్ రాజేశ్ తివారి స్వస్థలం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం. సిద్దిపేట జిల్లా కోహెడకు చెందిన కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ కూడా ఈ ఎన్ కౌంటర్‏ మృతుల్లో ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments