నగరంలో భారీ చోరీ జరిగిన ఘటన నాలుగవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.
నగరంలోని రోటరీ నగర్ లో నివాసం ఉంటున్న కొమురయ్య శనివారం సాయంత్రం తన ఇంటికి తాళం వేసుకొని బయటకు వెళ్లాడు.
తిరిగి 11 గంటలకు ఇంటికి వచ్చే సమయానికి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో నుండి నాలుగున్నర తులాల బంగారం, 25వేల నగదు,కొంత వెండి అపహరించినట్లు పేర్కొన్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.