పురుగుల మందు సేవించి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
నగరంలోని లలిత నగర్ కు చెందిన కొత్వాల్ రామ్ గోపాల్ (57). తన కూతురికి వివాహ సంబంధాలు వస్తలేవని మనస్థాపం చెంది ఈనెల 21న పురుగుల మందు సేవించాడు.
గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఐదవ టౌన్ ఎస్సై వెంకట్రావు పేర్కొన్నారు.