పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
వారి తెలిపిన వివరాల ప్రకారం.వేల్పూరు మండల కేంద్రంలో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట ఆడుతున్న ఐదు గురిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
వారి నుంచి రూ 44980 నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.