సింక్రో సర్వ్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థపై విరుచుకుపడ్డ అభ్యర్థులు..నిజామాబాద్ నగరంలోని సింక్రో సర్వ్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థలో శిక్షణ కాలం పూర్తయిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో అభ్యర్థులు, ఎన్ ఎస్ యుఐ ఆద్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు.
సోమవారం నగరంలోని యెండల టవర్స్ వద్ద గల ‘సింక్రో సర్వ్’ ఏజెన్సీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద వివిధ కోర్సులు పూర్తిచేసినా తమకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వాపోయారు.
శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు కోర్సు శిక్షణ పూర్తి అయిన 20 రోజుల్లోగా సర్టిఫికెట్స్ ఇవ్వాల్సి ఉండగా మూడు నెలలు అయినా ఇప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని,
అభ్యర్థులు సర్టిఫికెట్స్ అడిగితే సింక్రో సర్ గ్లోబల్ సొల్యూషన్స్ యాజమాన్యంలోని కొంతమంది సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అలాగే సింక్రో సర్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ శిక్షణ పేరుతో వందల మంది విద్యార్థుల సమయాన్ని, శ్రమను వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సింక్రో సర్వ్ గ్లోబల్ సొల్యూషన్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అలాగే ఈ సంస్థ ద్వారా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు వెంటనే సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు బట్టు వేణురాజ్,అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.