.తెలంగాణ వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్ శనివారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి లోని పలు వార్డులను సందర్శించి పలు సూచనలు చేశారు.
ఈ మేరకు జీ జీ హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్.. ఆసుపత్రికి కావలసిన అవసరాల కోసం వారి దృష్టికి తీసుకువెళ్లారనీ పేర్కొన్నారు.
దానికి ఆయన సానుకూలంగా స్పందించారని డాక్టర్ ప్రతిమ రాజ్ పేర్కొన్నారు. ఈ సందర్శనలో జీజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు.