HomeCRIMEహైదరాబాద్ లో దొంగల ముఠా గుట్టు రట్టు....ముగ్గురు అరెస్ట్....

హైదరాబాద్ లో దొంగల ముఠా గుట్టు రట్టు….ముగ్గురు అరెస్ట్….

హైదరాబాద్ లో దొంగల ముఠా పోలీసులు గుట్టును రట్టు చేశారు.శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు మాట్లాడుతూ..

గత 15 రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో ఈ నిరాయుధ డ్రిల్/సర్ప్రైజ్ ఫ్రిస్కింగ్ చొరవను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.

అందుకు ఈ డ్రిల్ల్ లో భాగంగా శుక్రవారం సాయంత్ర 06:30 సాయంత్రం టోలీచౌకి బృందావన్ కాలనీలోని మోడరన్ కేఫ్‌లో నిర్వహించిన డిసార్మింగ్ డ్రిల్‌లో భాగంగా టోలిచౌకి లోని బృందావన్ కాలనీ లో తనిఖీ నిర్వహించారు.

ఈ తనిఖీలో సయ్యద్ అలీ హుజైఫా,మొహమ్మద్ అజ్మల్ షరీఫ్ లు పోలీసులను చూసి తడబడి మోటార్ సైకిల్ పై పారిపోతున్న వీరిని ,ఫిల్మ్ నగర్ పోలీసులు అయిన ఎస్‌ఐ శ్రీకాంత్‌, కానిస్టేబుల్‌ జనార్దన్‌లు వెంబడించి పట్టుకున్నారు.

వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, వేలిముద్రల విశ్లేషణలో వీరు గతంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 10కి పైగా చోరీలకు పాల్పడి పేరుమోసిన ఇంటి దొంగలని తెలిసింది.

ఈ ఇద్దరు దొంగలను అరెస్టు చేసి విచారణ చేసి వీరి వద్దనుంచి ఒక రిసీవర్, 300 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, సెల్‌ఫోన్, US డాలర్ , రాడో గడియారాలు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీరిద్దరూ 10 కేసులను అంగీకరించగా, వీటిలో 7 కేసులకు సంబంధించిన 30 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 6 కేసులు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో, రెండు ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ లో,ఒకటి గుడిమల్కాపూర్ పీఎస్ లో, ఒకటి నార్సింగి పీఎస్ లో,వారిపై కేసులు నమోదయ్యాయని వారు పేర్కొన్నారు.

వారి వద్దనుంచి దొంగిలించబడిన సొత్తును బహదూర్ పురలోని ఎండీ అబిద్ బియానీ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ లు తెలిపారు. అబిద్ బియానీ కూడా పోలీసులు అరెస్టు చేశారు.

రికవరీ చేయబడిన వేరి దగ్గర నుంచి 30 తులాల బంగారం,45 తులాల వెండి,2 సెల్ ఫోన్లు,USA $100,ఎవెంజర్స్ బైక్ ,రాడో, ఇతర గడియారాలు వీరి వద్ద నుంచి స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వీరిని అరెస్టు చేయడంలో ఎస్‌ఎం విజయ్ కుమార్, ఐపీఎస్, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, వెస్ట్ జోన్ పర్యవేక్షణలో ఎస్.శ్రీకాంత్ తో కూడిన దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. M.శ్రీనివాసులు (SHO), N. జయరామ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ (ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్).

ఎస్‌ఐ జె.శ్రీకాంత్ రెడ్డి (డిఎస్‌ఐ), హెచ్‌సి-2923 వి.జనార్దన్ నాయక్, పిసి-5456 బి హరీష్ కుమార్, పోలీసు బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments