నిజాంసాగర్ కెనాల్ ద్వారా ఆలీ సాగర్ దిగువన ప్రాంతానికి సాగునీరు అందించడం గురించి బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారు కలెక్టర్ గారికి మెమోరండం అందజేయడం జరిగింది .
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై చాలా రోజుల అవుతున్న వర్షాలు కురువక రైతులు వేసినటువంటి వరి నార్లు ఎండిపోతున్నాయి వారి నాట్లు వేద్దాం అనుకుంటున్నా సాగునీరు లేకపోవడం వర్షాలు కురువకపోవడంతో రైతులు నానా అవశలు పడుతున్నారు.
కావున నిజం సాగర్ కెనాన్ ద్వారా హాలిసాగర్ దిగువన ప్రాంతానికి వరి నాట్లు వేసుకోవడానికి సాగునీరు అందించాలని కోరుతున్నాము ఇదివరకి నిజాంసాగర్ పరివాహక ఎగువ ప్రాంతాలైన బోధన్ బాన్సువాడ కు సాగునీరు అందించి అక్కడి రైతులను ఆదుకోవడం జరిగింది .
కావున నిజాంసాగర్ కెనాన్ ద్వారా ఆలీ సాగర్ దిగువన ప్రాంతానికి వరి నాట్లు వేసుకోవడానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కలెక్టర్ గారిని కోరారు