నగరంలోని అదృశ్యమైన వ్యక్తి బాసర గోదావరిలో శవమై కనిపించాడు.నాలుగవ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన కల్లెపల్లి రాజు(36) ఈ నెల 3 న కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని తెలిపారు.
ఈ మేరకు కుటుంబ సభ్యులు నాలుగవ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు.
రాజు ఆచూకీ కోసం కుటుంబీకులు, పోలీసులు గాలించగా ఆదివారం బాసరలోని గోదావరి నదిలో శవమై కనిపించాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.