ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
నగరంలోని గోశాల దగ్గరలో ఉన్న శైలజ గ్రౌండ్ ప్రాంతంలో గుర్తు తెలియని ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.మృతుడు సుమారు 10రోజుల క్రితం ఆత్మ హత్య చేసుకొని ఉన్నట్లు తెలిపారు.
మృతుని వయస్సు సుమారు 35సంవత్సరాలు ఉంటుదని తెలిపారు.మృతుని వివరాలు తెలిసిన వారు ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని సూచించారు.
