HomeTelanganaNizamabadమహిళా సాధికారతకు ‘ఇందిరా మహిళా శక్తి’...నగరంలో ఘనంగా చీరల పంపిణీ...ప్రారంభించిన మేయర్ కూరగాయల ఉమారాణి..

మహిళా సాధికారతకు ‘ఇందిరా మహిళా శక్తి’…నగరంలో ఘనంగా చీరల పంపిణీ…ప్రారంభించిన మేయర్ కూరగాయల ఉమారాణి..

మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు.

నగర పాలక సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం నగరంలో 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు “ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం” ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్, అర్హులైన మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతిే సమాజ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు.

మహిళా शक्तिకి మరింత బలం చేకూర్చేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని, డ్వాక్రా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇవి ఎంతో దోహదపడతాయన్నారు.

నగర పరిధిలోని అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వ ఫలాలు అందేలా మెప్మా అధికారులు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెప్మా డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ (డీఎంసీ) మధులత, టౌన్ మిషన్ కోఆర్డినేటర్ శోభారాణి, ఏరియా సీఓ హారిక, ఇతర కమ్యూనిటీ ఆర్గనైజర్లు , రిసోర్స్ పర్సన్స్ , వివిధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments