అధికార కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ తీవ్ర దుమారం రేపింది. సీపీ అధికార పార్టీ ఎమ్మెల్యే కు మధ్య మాటల యుద్దానికి దారితీసింది.
చివరికి వ్యవహారం సీఎంవో వరకు వెళ్ళింది.ఈ పరిణామాలు ఆవైపు కు వెళ్తాయనేది పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రేవంత్ రెడ్డి సర్కార్ చివరి దఫాగా శుక్రవారం రైతులకు ఋణ మాఫీ చేసింది.
రుణమాఫీ పొందిన రైతులతో అధికార పార్టీ నేతలు ఆయా సెగ్మెంట్ లలో పెద్దఎత్తున సంబరాలు తల పెట్టారు. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధి లో మోపాల్ మండల కేంద్రంలో రైతు వేదికలోశనివారం సంబరాలు చేయడానికి పోలీస్ శాఖ నుంచి అనుమతి పొందారు.
ఈ మేరకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. మోపాల్ సహకార సంఘం పరిధి లోని పలుగ్రామాల రైతులు ఈ సభ కు పెద్దఎత్తున తరలివచ్చారు. కానీ చివరిలో ట్రాక్టర్ ల ర్యాలీ కి సిద్ధం అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి రైతు వేదిక దాక భారీ ట్రాక్టర్ ర్యాలీ కి ఏర్పాట్లు చేశారు.
అయితే ముందస్తుఅనుమతి లేదంటూ ర్యాలీ నిర్వహించడం ఫై పోలీసులు ఆక్షేపించారు. ర్యాలీ వద్దంటూ కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పారు. ఆలా చేయాలంటే పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు.
ఈలోపు జిల్లా కేంద్రం నుంచి ఇద్దరు సీఐ లతో అదనపు బలగాలు సైతం రంగంలోకి దిగాయి. ఎమ్మెల్యే లకు విషయం తెలిసి అక్కడికి వచ్చిన అధికారుల మీద నిప్పులు చెరిగారు.
వెంటనే కమిషనర్ కు ఫోన్ చేసి విషయం ఆయన దృష్టికితెచ్చారు కానీ ఆయన కూడా సున్నితంగానే అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రాక్టర్ ర్యాలీ అనుమతి ఎందుకని ఎమ్మెల్యే యధాలాపంగా అన్నారు. కానీ అనుమతి లేకుండా ర్యాలీ చేయొద్దని సీపీ నచ్చజెప్పారు.
ఈ క్రమం లోనే ఎమ్మెల్యే లకు సీపీ లకు మధ్య కొద్దీ సేపు మాటల యుద్ధం నడిచింది. ఓ దశలో అక్కడి నుంచే ఎమ్మెల్యే సీఎం రేవంత్ ను ఫోన్ లో సంప్రదించడానికి సిద్ధం అయ్యారు కానీ ఆయన ఢిల్లీ లో బిజీగా వుండడంతో సీఎంవో లో కీలక అధికారి దృష్టి కి తెచ్చారు.
కానీ కొద్దీ సేపట్లోనే సీఎం సైతం లైన్ లోకి రావడంతో సీపీ వ్యవహారం ఫై పిర్యాదు చేసారని సమాచారం అయినప్పటికి పోలీసులు వెనక్కి తగ్గలేదు.దీనితో చేసేది లేక ట్రాక్టర్ ర్యాలీ ని రద్దు చేసి రైతు వేదికలో సంబరాలతో సరిపెట్టుకున్నారు.
మొత్తానికి అధికార పార్టీ నేతలకు పోలీసులు గట్టి ఝాలకే ఇచ్చారు.పోలీసులు తమ చెప్పు చేతల్లో ఉన్నారంటూ విర్రవీగుతున్న చోట నేతలు ఒక్కసారిగా ఖంగు తిన్నారు