లిక్కర్ కేసులో జైలు లో ఉన్న ఎమ్మెల్సీ కవిత కు మంగళవారం సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో రాత్రి 9 గంటలకు తీహార్ జైలు నుంచి విడుదల అయ్యారు.
జైలు వద్ద బిఆర్ యస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు లతో పాటు ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీ లు పార్టీ శ్రేణుల పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు. ఆమె మునుపటి ఉత్సహం తోనే వారికి అభివాదం చేశారు.
అంతకు ముందు కవిత కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు పదిలక్షల ష్యురీటి లు ఇవ్వాలని పాస్ పోర్టు అప్పగించాలని సుప్రీం ధర్మాసనం షరతుల్లో పేర్కొంది.
ఈ మేరకు ట్రయల్ కోర్టు అయిన రౌస్ అవెన్యూ కోర్టు కు సైతం సమాచారం ఇచ్చింది. దీనితో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ ఎంపీ రవి చంద్ర లు వెళ్లి ట్రయల్ కోర్టు లో సాయంత్రం ష్యురీటి లు ఇచ్చారు.
అక్కడ ఈ పక్రియ పూర్తికావడం లో జాప్యం జరిగింది. ఆమె బెయిల్ గ్రాంట్ చేస్తూ ట్రయల్ కోర్టు నుంచి తీహార్ జైలు కు మెయిల్ పెట్టారు.