HomePOLITICAL NEWSNationalపసుపు బోర్డు ఏర్పాటుకు.. నందిపేటలో మోడీకి పాలాభిషేకం…

పసుపు బోర్డు ఏర్పాటుకు.. నందిపేటలో మోడీకి పాలాభిషేకం…

నందిపేట మండల కేంద్ర నంది విగ్రహం వద్ద మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మండల భాజపా శ్రేణులు.

నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుచేసి మంగళవారం ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఆ పసుపు బోర్డు కు భాజపా సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డిని చైర్మన్గా నియమించడంతో నందిపేట మండల భాజపా శ్రేణులు ఆనందోత్సవంతో టపాకాయలు పేల్చి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞత తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ మోర్చా నాయకులు గడ్డం చిన్నరెడ్డి మాట్లాడుతూ…

భారత ప్రధాని నరేంద్ర మోడీకి, ఇందూరు ఎంపీ బీసీ ముద్దుబిడ్డ ఎంపీ అరవింద్ ధర్మపురి కి మండల రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఇచ్చిన మాట ప్రకారం గా ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని చెప్పిన మాటకు కట్టుబడి ఎంతో కృషిచేసి పసుపు బోర్డు తెచ్చి చూపించాడని,

రైతుల అభివృద్ధి కొరకు ప్రాంతాలవారీగా అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా రైతులు అభివృద్ధి చెందేందుకు బిజెపి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ పసుపు పంట పండించడంలో అగ్రగామి అని, పచ్చ బంగారాన్ని పండించే ఇక్కడి రైతన్నలకు మంచి ధర పలికేందుకు

ఈ పసుపు బోర్డు ఎంతగానో ఉపయోగపడుతుందని, జాతీయస్థాయి బోర్డు కాబట్టి ఎగుమత్తుల దృష్ట్యా స్టోరీలు, మార్కెటింగ్ తో పాటు అనేక రకాల ఉపయోగాలు పసుపు రైతులకు కలుగుతాయని,ఈ బోర్డు ప్రారంభోత్సవంతో పసుపు రైతులు ఎంతో సంతోషపడుతున్నారన్నారు. అంతేకాకుండా ఈ బోర్డుకు సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డిని చైర్మన్గా నియమించడం పట్ల జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.

మండల బిజెపి నాయకులు, భూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments