దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న పసుపు బోర్డు ఎట్టకేలకు సాకారం కావడంతో కాషాయ శ్రేణులసంబరం అంతా ఇంతా కాదు. సంక్రాతి పండగ నాడే మంగళవారం కేంద్ర మంత్రి ఎంపీ అర్వింద్ తో కలిసి వర్చువల్ గా బోర్డు ను ప్రారంభించారు.
బోర్డు ను నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం తో పాటు మొదటి ఛైర్మెన్ గా బీజేపీ సీనియర్ నేత స్వయంగా పసుపు రైతు గా ఉన్న పల్లె గంగారెడ్డి నియామకం అయ్యారు. గత ఎన్నికలకు ముందే ప్రధాని హోదా లో మోడీ ఇచ్చిన హామీ మేరకు కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది కానీ ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
హోం మంత్రి అమిత్ షా మాత్రం నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు కానీ సాగు లో దేశంలోనే ఎంతో ఖ్యాతి పొందిన మహారాష్ట్ర లోనే బోర్డు హెడ్ క్వార్ట్రర్స్ ఉండాలని అక్కడి బీజేపీ నేతలు ఒత్తిడి చేశారు.
అందుకే అక్కడి అసెంబ్లీ ఎన్నికల దాక ఓపిక పట్టిన కేంద్రం ఎట్టకేలకు ఇచ్చిన మాట మేరకు నిజామాబాద్ లో బోర్డు కార్యాలయం ఏర్పాటు చేస్తూ జోవో ఇచ్చేసింది. మంగళవారం ఆచరణలోనూ వచ్చేసింది. గతంలో బిఆర్ యస్ నేతలు ఎంపీ అర్వింద్ ను లక్ష్యంగా చేసుకొని పసుపు బోర్డు హామీ ఫై తీవ్ర విమర్శలు చేసే వారు.
రైతుల ముసుగులో ఆయన మీద భౌతిక దాడులకు సైతం పాల్పడింది.కానీ పసుపు రైతులకు తానిచ్చిన హామీ ని ఆచరణ లో పెట్టడానికి ఆయన కేంద్రంలో ఓ యుద్ధమే చేసారని ఆయన సన్నిహితులు చెప్తారు. ఓ దశ లో బీజేపీ క్యాడర్ లోనూ బోర్డు వస్తుందా లేదా అనే డౌట్ వుండేది. అందుకే బోర్డు ప్రకటన తో క్యాడర్ సైతం సంబరాలు చేసుకుంది.
అయిదు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పసుపు బోర్డు ను సాకారం చేయడంతో ఎంపీ గా అర్వింద్ జిల్లా చరిత్ర లో నిలిచి పోయారని కమలనాధులు కితాబు ఇస్తున్నారు. రాజకీయంగా మైలేజి సంగతి ఎలా ఉన్న జిల్లా అభివృద్ధి లో పసుపు బోర్డు మాత్రం ఖచ్చితంగా ఓ మైలు రాయి గా నిలిచి పోతుంది.
