Tuesday, January 20, 2026
HomeLaw and Orderశాంతిభద్రతలపై పోలీసు కమిషనర్‌తో ఎంపీ అర్వింద్‌ భేటీ..

శాంతిభద్రతలపై పోలీసు కమిషనర్‌తో ఎంపీ అర్వింద్‌ భేటీ..

ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితులపై నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అర్వింద్‌ శుక్రవారం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు.

నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని ఈ సందర్భంగా సీపీకి సూచించారు.

ముఖ్యంగా యువత చెడు మార్గాల వైపు మళ్లకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.అనంతరం జిల్లాలో పలు సమస్యలపై చర్చించి, పోలీసు శాఖకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎంపీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!