నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సిన కోట్లాది రూపాయల టాక్సులు కొంతమంది వ్యాపారస్తులు చెల్లించడం లేదని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి అక్టోబర్ 7- 2024న సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(i) ననుసరించి సెక్షన్ 4 (iv) ప్రకారం 2022-2023 సంవత్సరానికి ఈ కింద పేర్కొన్న వ్యాపార సంస్థలు మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించినా, చెల్లించాల్సిన ట్యాక్స్ వివరాలు ఇవ్వమని దరఖాస్తు చేయడం జరిగింది.
1. నిఖిల్ సాయి హోటల్,2. వేణు మహల్, 3.త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్, 4.వంశీ హోటల్,5. దేవి లాడ్జ్, 6.ఉషా మయూరి మల్టీప్లెక్స్,7.ప్యారడైజ్,8.దేవి థియేటర్,9.కపిల హోటల్,10.హోటల్ మహిఫిల్,మనోరమ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారు 2022-2023 వరకు మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించిన ట్యాక్స్ వివరాలు కావాలని విజ్ఞప్తి చేస్తూ అక్టోబర్ 7 2024న దరఖాస్తు చేస్తే , జనవరి 24-1-2025న మున్సిపల్ కార్పొరేషన్ నుండి నాకు పంపిన సమాధానం ఈవిధంగా ఉంది మీరు అడిగిన వ్యాపార సంస్థల పేర్లు పరిశీలించగా పైన పేర్కొన్న సంస్థల పేర్లపై ఇప్పటివరకు ఎలాంటి ట్యాక్స్ నమోదు కాలేదని సమాధానం పంపించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.
అంటే కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు నిర్వహించే వ్యాపార సంస్థల పేర్లపై ఎలాంటి ట్యాక్స్ నమోదు కాలేదని చెబుతున్నారు అంటే సంబంధిత వ్యాపార సంస్థలతో సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అవినీతికి పాల్పడి మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సిన కోట్ల రూపాయలు ఎగ్గొట్టే ప్రయత్నానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తోడ్పడుతున్నారని అర్థమవుతుంది.
మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ సెక్షన్ లో జరుగుతున్న అవినీతి ఆరోపణలపై జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపి దోషులుగా తేలిన వారిని ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ గత ఆరు నెలలుగా కార్మికుల పట్ల, రెవెన్యూ వసులులో ఆయన వ్యవహారిస్తున్న తీరుపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు
