కేంద్ర ప్రభుత్వం జూలై 1నుంచి అమల్లోకి తీసుకొచ్చిన నూతన న్యాయ చట్టాలపై అందరికీ అవగాహన ఉండాలని తీపి కల్మేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని మీడియా ప్రతినిధులకు నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), సీఆర్పీసీ చట్టాన్ని భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్ను భారతీయ సాక్ష్యఅధినియమం చట్టాలుగా మార్పు చేశారన్నారు.
ఐపీసీలో 511 చట్టాలు ఉంటే వాటిని బీఎన్ఎస్లో 358కి తగ్గించారని చెప్పారు. అదేవిధంగా సీఆర్పీసీలో 484 వరకూ ఉంటే వాటిని బీఎన్ఎస్ఎస్లో 531కి పెంచారని, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 167 చట్టాలు ఉంటే వాటిని బీఎస్ఎలో 170కి పెంచారన్నారు.
కేంద్రప్రభుత్వం అందరికీ అవసరమైన, ఆమోదయోగ్యమైన చట్టాలను ఏర్పాటు చేసిందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏసిపి రాజా వెంకటరెడ్డి, అదనపు డిఎస్పి కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసిపి నారాయణ, జిల్లాలోని ఇన్స్పెక్టర్ లు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
