నిజామాబాద్ జిల్లాలోని పలు ఎక్సైజ్ పొలీస్ స్టేషన్ ల పరిధిలో పట్టుబడిన నిషేధిత గంజాయి, డైజోపాం, అల్రాజోలం మత్తు పదార్థాలను సోమవారం ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు.
నిజామాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణలో జక్రాన్పల్లి మండలం పడ్కల్ గ్రామంలో మెడికేర్ సర్వీసెస్ లొ వివిధ ఎక్సైజ్ స్టేషన్, పరిదిలలో ఎన్డిపిఎస్ కేసులలో ఉన్నట్లువంటి 1700.5 కిలోల ఎండు గంజాయి, 72.2 కిలోల డైజో ఫామ్,64.27 కేజీల అల్ఫాజోలం, ఒక్క గంజాయి మొక్కలను దహనం చేసినట్లు తెలిపారు.
మొత్తం మత్తు పదార్థాల విలువ రూ.12.22 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇందులో ఎస్ హెచ్ ఓ లు, సంబంధిత స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
