నారీశక్తి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని అర్బన్ ఎంఎల్ఏ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. మాధవస్మారక సేవా సమితి మహిళా స్వయం ఉపాధి శిక్షణ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల కోసం ఆయా అంశాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారని, ఇది గర్వించదగ్గ విషయమన్నారు. ప్రస్తుతం అందించిన ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని, స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలన్నారు.
అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాధవ స్మారక సేవాసమితి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, హితేన్ భీమాని తదితరులు పాల్గొన్నారు.
