ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ 1879లో జనవరి 23న ఒడిశాలోని కటక్‌లో జానకీ నాథ్, ప్రభావతీ బోస్‌లకు సుభాష్ చంద్రబోస్ జన్మించడం జరిగిందని అన్నారు.. అదేవిధంగా గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరి, స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ అహింస విధానాన్ని విభేదించి బోస్ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచిందన్నారు.
అలాగే స్వాతంత్రానికి సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి, స్వాతంత్ర భరతావని ఒక్కటే మనకు స్వర్గమని చాటి , ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకొని ఆంగ్లేయులతో పోరాడిన ధీరుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. అదేవిధంగా మీ రక్తాన్ని ఇవ్వండి స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాలతో భారతదేశ ప్రజలందరిలో దేశభక్తి స్ఫూర్తిని నింపి, మహిళలను కూడా స్వాతంత్రోద్యమంలో భాగం చేసి స్వాతంత్రోద్యమం కోసం జరిపిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు.
అదేవిధంగా నేటి భారత పౌరులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా,విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని అలాగే దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో USFI నగర కార్యదర్శి పోషమైన మహేష్ నగర ఉపాధ్యక్షులు వేణు, మారుతి మరియు నగర కమిటీ సభ్యులు సాయి,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
