తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యం సెయింట్ జెవియర్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది డి ఈ ఓ అందుబాట్లో లేకపోవడం వల్ల ఏ ఓ నాగలక్ష్మి మేడమ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ సెయింట్ జెవియార్స్ స్కూల్ ప్రాథమిక వసతులు లేకుండా పిల్లల కోసం సరైన భద్రతలు మరియు శిక్షణ వాతావరణం లేకుండా పాఠశాల నడిపిస్తున్నారు ఈ పాఠశాల రహదారికి చాలా దగ్గరగా ఉంది
అనేకసార్లు రోడ్డు ప్రమాదాలు చోటు చోటుచేసుకున్నాయి ఈమధ్య భోగి సంబరాల సందర్భంగా పిల్లల భద్రతను నిర్లక్ష్యం చేయడంతో అగ్ని ప్రమాదం జరిగింది రెండవ తరగతి విద్యార్థిని కోమలి మంటలు అంటుకోవడంతో ఆమె కళ్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది ప్రస్తుతం ఆ బాలిక ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంధని అన్నారు
ఈ సంఘటనలో స్కూల్ నిర్వాహకులు నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి భద్రత ప్రమాణాలు పై దృష్టి పెట్టకపోవడం విద్యార్థులను పట్ల జాగ్రత పట్ల అశ్రద్ధ పాటిస్తున్న ఈ పాఠశాల నడుస్తున్న పరిస్థితిలను పరిశీలించి 2025 2026 విద్యాసంవత్సరానికి గాను సెయింట్ జెవియర్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర నాయకులు రెహన్ , మనోహర్, ధోనీ తదితరు పాల్గొన్నారు
